బీజేపీ మిత్రపక్షం నుంచి అమర్‌ సింగ్‌కు ఆహ్వానం

BJP Ally Offer MP Seat To Amar Singh - Sakshi

వారణాసి : సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృ నేత అమర్‌ సింగ్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు బీజేపీ మిత్రపక్షం సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ)  తెలిపింది. ఆయనకు ఇష్టమైతే 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయవచ్చని పేర్కొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్నోలో పర్యటించిన సందర్భంగా అమర్‌ సింగ్‌కు అనుకూల  వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమర్‌ సింగ్‌ స్పందిస్తూ ప్రధాని మోదీ, సీఎం యోగి అదిత్యనాథ్‌లకే తాను ఒటేస్తానని చెప్పడంతో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

తాజాగా ఎస్‌బీఎస్‌పీ కూడా అమర్‌ సింగ్‌ను తమ పార్టీలోకి ఆహ్వానం పలకడం చూస్తుంటే ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలో నిలువనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్‌బీఎస్‌పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌బార్‌ మంగళవారం వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ.. అమర్‌ సింగ్‌ ఒక పెద్ద నాయకుడు. ఒకవేళ ఆయనకు ఇష్టమైతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అజాంఘడ్‌ లోక్‌సభ స్థానం(పొత్తులో భాగంగా తమ పార్టీకి వస్తే) నుంచి పోటీ చేయవచ్చన్నారు. అమర్‌సింగ్‌ వస్తే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అజాంఘడ్‌ ఎంపీగా ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ ఉన్నారు.

మోదీ, యోగిలకే నా మద్దతు: అమర్‌సింగ్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top