
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కాగా ఇటీవల పవన్ కల్యాణ్ లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోనే గేదెల శ్రీనివాస్ పేరును ప్రకటించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీడీపీ నెల్లూరు రూరల్ నుంచి టికెట్ ఖరారు అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఇవాళ వైఎస్సార్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి.....(జనసేన తొలి జాబితా విడుదల)