దోచుకున్నది దాచుకోడానికే... | battula brahmananda reddy slams Chandrababu | Sakshi
Sakshi News home page

దోచుకున్నది దాచుకోడానికే...

Jan 23 2018 2:26 PM | Updated on Jul 28 2018 3:46 PM

battula brahmananda reddy slams Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దోచుకున్న అవినీతి సొమ్మును దాచుకోవటానికే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు గద్దె నెక్కినప్పటి నుంచీ ఏటా నాలుగుసార్లు విదేశీ పర్యటనలు చేస్తున్నారని,  ఇప్పటికి 17సార్లకు పైగా ఇలాంటి పర్యటనలు చేశారని చెప్పారు. ఎన్ని పర్యటనలు చేసినా ఈ నాలుగేళ్లలో సీఎం సాధించింది ఏమీ లేదన్నారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.

దావోస్‌కు చంద్రబాబుతో పాటు సీఎం రమేష్, లోకేష్‌ వెళ్లటంలో ఆంతర్యం ఏమి టని ప్రశ్నించారు. రమేష్‌ అనుభవం అంతా కాంట్రాక్టుల్లో సంపాదిం చటమేనని విమర్శించారు. ఇక లోకేశ్‌కు ఉన్న అనుభవం ఏమిటో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు విదేశీయాత్రల వివ రాలను పొందుపరుస్తూ శ్వేతపత్రం విడు దల చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. విదేశీ పర్యటనల్లో రూ.వేల కోట్లలో పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నట్లు ప్రచారం చేశారే తప్ప ఒక్క శాతం నిధులూ తేలేకపోయారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement