సిగ్గు ఉంటే రాజీనామా చెయ్‌ : బాజిరెడ్డి

Bajireddy Govardhan fires on D Srinivas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిగ్గు, లజ్జ ఉంటే ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) టీఆర్‌ఎస్‌ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని బాజిరెడ్డి గోవర్ధన్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. డీఎస్‌ వల్ల టీఆర్‌ఎస్‌కి ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు.

డీఎస్‌కు రాజ్యసభ సీటు కోసం ఆరాటం తప్ప మరొకటి లేదని విమర్శించారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే రాజ్యసభ సభ్యుడిగా పదవిని అనుభవించవచ్చని డీఎస్‌ ఆరాటపడుతున్నారన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top