నిరూపించండి.. పోటీ నుంచి తప్పుకుంటా : గంభీర్‌

Atishi Breaks Down Over Offensive Pamphlet And AAP Blames Gautam Gambhir - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆప్‌ పార్టీ తరఫున తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆతిషి విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతకు విషయం ఏంటంటే.. ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న పాంప్లెట్లు పంచారు. అయితే ఈ పాంప్లెట్ల వెనక బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఉన్నట్లు ఆప్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ‘గంభీర్‌ నువ్వు ఇంత నీచానికి పాల్పడతావని అనుకోలేదు’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాక ‘ఆతిషి నీ పరిస్థిని మేం అర్థం చేసుకోగలం. నీకు మద్దతుగా నిలబడి ఇలాంటి దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడతాం. మీరు ధైర్యంగా ఉండండి’ అని తెలిపారు.

ఈ క్రమంలో ఆతిషి మాట్లాడుతూ.. ‘ఓ మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తించిన నువ్వు.. ఇక లక్షలాది స్త్రీలకు ఎలా రక్షణ కల్పిస్తావ్‌’ అంటూ గంభీర్‌ని ప్రశ్నించారు. అయితే తనపై వస్తోన్న ఈ ఆరోపణలపై గంభీర్‌ స్పందించారు. ఆతిషిని అవమానిస్తూ.. పాంప్లెట్లు పంచింది తానేనని నిరూపిస్తే.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని గంభీర్‌ ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top