జేసీ దివాకర్‌ రెడ్డికి ఎదురుదెబ్బ | Anantapur TDP leaders Serious On JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

జేసీ దివాకర్‌ రెడ్డికి ఎదురుదెబ్బ

Sep 10 2018 7:00 AM | Updated on Sep 10 2018 7:00 AM

Anantapur TDP leaders Serious On JC Diwakar Reddy - Sakshi

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి

సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగలింది. జేసీ తీరుపై అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి  ఫిర్యాదు చేయడానికి అనంతపురం టీడీపీ నాయకులు సిద్దమయ్యారు. జేసీ ఆధిపత్యాన్ని టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో జేసీ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. జేసీ బూతులు తిడుతున్నా చంద్రబాబు మౌనంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు మౌనం వల్లే జేసీ రెచ్చిపోతున్నారని పార్టీలోని కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీ నోటి దురుసు కారణంగానే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement