రాజకీయ దుర్బుద్ధి తప్ప.. ప్రజలపై ప్రేమ ఏదీ! | Ambati Rambabu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

రాజకీయ దుర్బుద్ధి తప్ప.. ప్రజలపై ప్రేమ ఏదీ!

Apr 26 2020 4:30 AM | Updated on Apr 26 2020 4:46 AM

Ambati Rambabu Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా విపత్తులోనూ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రస్తుత కష్ట సమయంలోనూ ఆయనకు ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఒక్క మంచి సలహా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► కరోనాను అరికట్టే యంత్రాంగంపై ప్రతిపక్షం రాళ్లు వేస్తోంది. టీడీపీ నేతలు ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది ముందుకొచ్చి పేదలకు సాయం చేస్తుంటే టీడీపీ నేతలొక్కరైనా బయటకు వస్తున్నారా?. 
► ఇళ్లల్లో కూర్చుని దొంగ దీక్షలు చేయడం కాదు.. చంద్రబాబు, లోకేష్‌ హైదరాబాద్‌ నుంచి రాష్ట్రానికి ఎందుకు రావడం లేదు. చంద్రబాబు భజన చేయొద్దని కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ అధిష్టానం మొట్టికాయలేసింది. 
► సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కోవిడ్‌ పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. 
► సీఎం వైఎస్‌ జగన్‌కు గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పటంలో ప్రావీణ్యత లేదు. పని చేయడంలో మాత్రమే ఆయనకు ప్రావీణ్యత ఉంది.
► ప్రస్తుత విపత్కర సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా సీఎం వైఎస్‌ జగన్‌ కొనసాగిస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని ప్రభుత్వంపై రాళ్లేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని బాబు ఏమీ డిమాండ్‌ చేయరు. ఏదైనా చేస్తే కేసీఆర్‌ దరువు వేస్తారనే భయం. 
► చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్‌ కీలు బొమ్మగా వ్యవహరించారు. చంద్రబాబు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారని అనుమానంగా ఉంది. 
► అశోక్‌బాబు పంపిన లేఖకు, కేంద్ర హోమ్‌ శా>ఖకు నిమ్మగడ్డ రాసిన లేఖకు ఒకే రిఫరెన్స్‌ నంబర్‌ ఎలా ఉంటుంది.
► నిమ్మగడ్డ రమేష్‌ రాసిన లేఖ టీడీపీ కార్యాలయం నుంచి మీడియాకు ఎలా చేరింది. దీనిపై పూర్తి వివరాలు బయటకు రావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement