డీఎంకేకు అళగిరి అల్టిమేటం

Alagiri Silent Rally In Chennai - Sakshi

చెన్నైలో అళగిరి నేడు భారీ ర్యాలీ

సాక్షి, చెన్నై : డీఎంకే మాజీ అధినేత కరుణానిధి మరణంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీపై పట్టుకు ఒక్కరికొకరు పోటీ పొడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణానిధి మరో కుమారుడు అళగిరి పార్టీపై తిరుగబాటు జెండా ఎగరవేశారు. స్టాలిన్‌ తమ నాయకుడు కాదని.. అసలైన డీఎంకే కార్యకర్తలు తన వెంటే ఉన్నారని ఇటీవల పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. దీంతో స్టాలిన్‌ వర్గానికి హెచ్చరికగా నేడు చెన్నైలో అళగిరి తన మద్దతు దారులతో శాంతి ర్యాలీని నిర్వహించనున్నారు.

అళగిరి తలపెట్టిన ర్యాలీకి పార్టీ కార్యకర్తలెవరు హాజరుకావద్దని డీఎంకే ఆదేశాలు జారీ చేసింది. కాగా అళగిరి 2014 లోకసభ ఎన్నికల సమయంలో కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఎంకేలో ఉన్న కొందరు కీలక నేతలు అళగిరికి మద్దతుగా ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అళగిరి తలపెట్టిన ర్యాలీతో డీఎంకేలో అందోళన మొదలైంది. మరోవైపు అళగిరి కదలికలను బీజేపీ ఆసక్తిగా గమనిస్తోంది. పార్టీపై తిరుగుబాటు చేసిన అళగిరిని తమవైపుకు తిప్పుకుంటే తమిళనాటలో కొంత బలపడొచ్చని కమళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీపై పట్టుకోసం స్టాలిన్‌ ఏలాంటి వ్యూహాలు అమలుచేస్తారో వేచి చూడాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top