వాళ్లతో ఉక్కు పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు

Akepati Amarnath Reddy Slams Chandrababu And Ramesh In Sundupalli - Sakshi

వైఎస్సార్‌ జిల్లా: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ వల్ల ఉక్కు కర్మాగారం వచ్చే పరిస్థితి లేదని రాజంపేట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి విమర్శించారు. సుండుపల్లిలో ఆకేపాటి విలేకరులతో మాట్లాడుతూ..సిగ్గు లేకుండా 25 ఎంపీ సీట్లు ఇవ్వండంటున్నచంద్రబాబు 19 ఎంపీలు ఉంటే ఏమి చేయగలిగాడని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలిచ్చిన ఇరు పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండి నాలుగు సంవత్సరాలుగా కాపురం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.

 రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం అనుకూలత అనుమతులు ఇవ్వాలి.. అలా ఇవ్వకుండా కేంద్రంపై ఆరోపణలు చేస్తూ రాజకీయ దీక్షలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్సార్ ఉక్కు కర్మాగారం మంజూరు చేస్తే వాటిని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడని చెప్పారు. చంద్రబాబుకు వైఎస్సార్ కలలోకి కూడా గుర్తుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఉక్కు కర్మాగారం పేరుతో దీక్షలు చేసి విమర్శించడం సిగ్గు చేటని అన్నారు. 

రెండు సార్లు రాజ్యసభకు ఎంపికైనా ఏనాడూ ఉక్కు కర్మాగారం గురించి పార్లమెంటులో నోరు మెదపని వ్యక్తి సీఎం రమేష్ అని తూర్పారబట్టారు. నాడు ఉక్కు కర్మాగారానికి అడ్డుపడిన చంద్రబాబు నేడు దొంగదీక్షలు అంటూ మోసం చేస్తున్నాడని..అలాంటి బాబు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోవాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డితోనే సాధ్యమని వ్యాఖ్యానించారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top