హెలికాప్టర్‌లో వెళ్లి నామినేషన్‌ | Ahead of taking on Yeddyurappa student leader mimics his chopper | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌లో వెళ్లి నామినేషన్‌

Apr 23 2018 9:11 AM | Updated on Sep 5 2018 1:55 PM

Ahead of taking on Yeddyurappa student leader mimics his chopper - Sakshi

సాక్షి, బెంగళూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప శికారిపురకు హెలికాప్టర్‌లో వచ్చి గత గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. తానేం తక్కువ కాదంటూ వినయ్‌ రాజావత్‌ అనే స్వతంత్ర అభ్యర్థి కూడా హెలికాప్టర్‌లోనే వచ్చి నామినేషన్‌ సమర్పించారు. 25 ఏళ్ల ఈ యువకుని స్వస్థలం బెంగళూరు కాగా, హెలికాప్టర్‌లో శికారిపురకు వెళ్లి  నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. హెలికాప్టర్‌ అద్దె డబ్బులను అతని స్నేహితులు భరించడం విశేషం.

ఎద్దులబండిలో వెళ్లాలనుకున్నా : రాజావత్‌ మాట్లాడుతూ అందరి కంటే విచిత్రంగా నామినేషన్‌ పత్రాలను సమర్పించాలని తొలుత తాను తలచినట్లు చెప్పారు. ఎద్దుల బండిలో వెళితే ఎలా ఉంటుందని  ఆలోచించా ను, కానీ ఆ తర్వాత యడ్యూరప్ప లాంటి వ్యక్తిని ఎదుర్కొవాలంటే హెలి కాప్టర్‌లో వెళ్లడమే ఉత్తమమని తన స్నేహితులు సూచించినట్లు చెప్పారు. రాజావత్‌  ‘విద్యార్థి’ అనే ఒక స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement