‘సీఎం జగన్‌ ఇంగ్లీషులో మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిందే’

Adimulapu Suresh Critics Chandrababu At Pratibha Puraskar In Vijayawada - Sakshi

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

విజయవాడలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం

సాక్షి, విజయవాడ : జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ..  భారత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యాదినోత్సవం నిర్వహిస్తున్నాం. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రోజునే అభివృద్ధి సాధ్యం. మా ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

మైనారిటీ విద్యార్థులకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజీలకు రూ.ఐదు వేలకు సీఎం జగన్ పెంచారు. దేశంలోనే తొలిసారిగా హజ్ యాత్రికలకు పూర్తి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. జెరూసలెం యాత్రికులకు కూడా ఆదాయాన్ని బట్టి అరవై, ముప్పై వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. చర్చి ఫాదర్లకు నెలకు ఐదు‌వేలు ఇస్తున్నాం’అన్నారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘విద్యాశాఖ, మైనారిటీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. విద్యాభివృద్ధితోనే సమానత్వం వస్తుందని అంబేద్కర్ చెప్పారు. ఆయన స్పూర్తి తో సీఎం జగన్ అందరికీ విద్యను అందేలా కృషి చేస్తున్నారు. మైనారిటీలకు మంచి విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. వైఎస్‌ జగన్.. అంజాద్ బాషాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి.. గుర్తించారు. కార్పొరేట్ విద్యా సంస్థల కు పోటీగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్దులకు ప్రోత్సాహం అందించాలని జగన్ నిర్ణయించారు. వైఎస్ ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చి పేదలకు ఉన్నత విద్యను దగ్గర చేశారు. సీఎం జగన్ కూడా దళితులు, మైనారిటీ లకు మెరుగైన విద్యను అందించేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 

ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధి నిదర్శనం. దీనిపై కొందరు అవాకులు, చవాకులు పేలుతున్నారు. వైఎస్‌ జగన్ ఇంగ్లీషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయి. నారా వారు కూడా మాట్లాడతారు.. మనం చూశాం.. బ్రీఫ్ డ్ మీ అని. కమిషన్ల కోసం వందల, వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింద’అని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి, వెల్లపల్లి శ్రీనివాస్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top