వైసీపీ విజయ దుందుభి : నా పగ తీరింది

Actor Sree Reddy Comments on YSRCP Landslide victory - Sakshi

 వైసీపీ విజయంపై నటి శ్రీరెడ్డి స్పందన

టీడీపీకి ఘోర పరాభవం - తోకముడిచిన జనసేన

నేను దేవసేన, జగన్‌ బాహుబలి.. నా పగ  తీరింది - శ్రీరెడ్డి

శ్రీరెడ్డిపై  విరుచుకుపడుతున్న పవన్‌ ఫ్యాన్స్‌ 

వివాదాస్పద నటి శ్రీరెడ్డి వైఎస్సార్‌సీపీ ఘనవిజయంపై స్పందించారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి  ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల సరళిపై అంతే వేగంగా స్పందించారు.  వైసీపీ గెలుపుపై ఫేస్‌బుక్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు.  తనను తాను  దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. 

నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి వన్ అండ్ ఓన్లీ జగన్’ అంటూ ఫేస్‌బుక్‌  పోస్ట్‌లో పేర్కొన్నారు. 

కాగా ఏపీ ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ  సర్కార్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోనుంది. అటు ప్రశ్నిస్తాను అంటూ ఊగిపోయిన నటుడు, జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ  సోదిలో కూడా లేకుండా తోక ముడిచింది.  ఈ నేపథ్యంలోనే  తన పగతీరిందంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార‍్హం. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ శ్రీరెడ్డి పోస్ట్‌పై విరుచుకు పడుతున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top