16 మందితో ఆప్‌ మూడో జాబితా | AAP releases third list of 16 candidates for telangana polls | Sakshi
Sakshi News home page

16 మందితో ఆప్‌ మూడో జాబితా

Nov 16 2018 5:05 AM | Updated on Nov 16 2018 5:05 AM

AAP releases third list of 16 candidates for telangana polls - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న రౌనత్‌ఖాన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో విడత జాబితాను ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం 47 మంది అభ్యర్థులను ప్రకటించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర రాముగౌడ్‌ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాముగౌడ్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ తరహా పాలన తెలంగాణలో తీసుకురావడానికి ఆప్‌ కృషి చేస్తుందని తెలిపారు. సామాజిక సేవలో పాల్గొన్న వ్యక్తులకు, క్రిమినల్‌ నేపథ్యం లేనివారికే టికెట్ల కేటాయింపులో పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా నిజాం మనవడు రౌనత్‌ఖాన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలో అరవింద్‌ కేజ్రివాల్‌ పాలన నచ్చి పార్టీలో చేరినట్లు రౌనత్‌ఖాన్‌ తెలిపారు. అనంతరం రౌనత్‌ఖాన్‌ చేతుల మీదుగా పార్టీ అభ్యర్థులకు బీ–ఫామ్‌లను అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement