పెను విధ్వంసంతో 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ధోనిసేన... సరిగ్గా రెండు వారాల తర్వాత మరోసారి దాన్ని పునరావృతం చేసింది.
ఓ సినిమా హిట్టయితే సీక్వెల్ తీయడం పరిపాటి. క్రికెట్‌లోనూ భారత్ అదే పని చేస్తోంది. పెను విధ్వంసంతో 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ధోనిసేన... సరిగ్గా రెండు వారాల తర్వాత మరోసారి దాన్ని పునరావృతం చేసింది.351 పరుగుల లక్ష్యాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఛేదించింది. అప్పుడు జైపూర్... ఇప్పుడు నాగ్‌పూర్... వేదిక మారిందంతే. జామ్‌తాలో పరుగుల మోత మోగింది. దీపావళికి ముందే ‘హండ్రెడ్‌వాలా’ పేలింది.
భారత త్రిమూర్తుల (కోహ్లి, ధావన్, రోహిత్) సంచలన ప్రదర్శనతో... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించి 2-2తో సిరీస్‌ను సమం చేసింది. ఇక ‘ఫైనల్’ వన్డే శనివారం బెంగళూరులో జరుగుతుంది.