వృద్ధులకూ ‘ఆపరేషన్ స్మైల్’ | operation smile for elders | Sakshi
Sakshi News home page

వృద్ధులకూ ‘ఆపరేషన్ స్మైల్’

Feb 3 2015 1:15 AM | Updated on Sep 5 2018 2:14 PM

తెలంగాణ రాష్ట్రంలో వీధిబాలల అభ్యున్నతి కోసం, తెలంగాణ పోలీసు యంత్రాంగం ఆపరేషన్ స్మైల్ పథకం పెట్టి, రోడ్లపై, వీధుల వెంట తిరుగుతూ బాలల జీవితాలకు బతుకుపై భరోసా కల్పిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వీధిబాలల అభ్యున్నతి కోసం, తెలంగాణ పోలీసు యంత్రాంగం ఆపరేషన్ స్మైల్ పథకం పెట్టి, రోడ్లపై, వీధుల వెంట తిరుగుతూ బాలల జీవితాలకు బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, కేన్సర్ బారినపడ్డ 12 ఏళ్ల బాలు డి కోరికను తెలుసుకొని స్వయంగా తానే నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రప్పించుకొని తన సీటుపై కూర్చుండ బెట్టిన వైనం అభినందించదగినది. సమాజం పట్ల పోలీసుల దృక్ప థంలో కూడా మార్పువస్తోంది. ఆపరేషన్ స్మైల్ పథ కాన్ని బాలలకే కాక, కన్న కొడుకులు, కూతుళ్లు తల్లిదం డ్రులను ఇంట్లోంచి వెళ్లగొట్టే వృద్ధులకు కూడా వర్తిం పజేసి వారిని వారసుల దగ్గరకి పంపించే ప్రయత్నాలు చెయ్యాలి. ఈ దిశగా తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ పోలీస్ యంత్రాం గాన్ని సిద్ధం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియో జకవర్గంలో మహిళా పోలీస్‌స్టేషన్‌లు ఏర్పాటు చేసి విడిపోతున్న భార్యాభర్తల గొడవలను ఈ పీఎస్‌ల ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తూ జంటలను ఏకం చేయాలి. ఆపరేషన్ స్మైల్‌ను బాలలకే కాక అన్ని వర్గాల వారి ముఖంలో చిరునవ్వులు నెలకొల్పేలా చేసేలా తెలంగాణ పోలీసు శాఖ పూనుకోవాలని అభ్యర్ధిస్తున్నాం.
 
 కోలిపాక శ్రీను  పద్మశాలి వీధి, బెల్లంపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement