కండ్లు తెరిసే లోపే... | munasa venkat wrote a thing | Sakshi
Sakshi News home page

కండ్లు తెరిసే లోపే...

Aug 23 2015 2:41 AM | Updated on Sep 3 2017 7:56 AM

కొద్దిసేపటి క్రితం.. అవి నీటి అడుగున ఉండె

కొద్దిసేపటి క్రితం
అవి నీటి అడుగున ఉండె
కొద్దిసేపటి క్రితం
నీటిపైకి వచ్చినవి
కొద్దిసేపటి క్రితం
గుంపులు గుంపులుగా
పూసతాడునుంచి
పై పందాడు దాక
నీళ్ల మధ్యలో వల
మెరిసిన బంగారు పరదా
కొద్దిసేపటి క్రితం
నా గుండెల నిండుగా పండుగ
ఎవరినీ తక్కువేమీ చేయలేదు
అందరూ విందులోనే వున్నారు
కొద్దిసేపటి క్రితం
వల తలలోనే వుండిపోయింది
చెరువులో చుక్కనీరు లేదు.
                            మునాస వెంకట్, 9948158163

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement