శ్రీజయనామ సంవత్సరం
శ్రీజయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం, తిథి శు.ద్వాదశి ఉ.9.11 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం కృత్తిక ఉ.7.17 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం రా.11.22 నుంచి 12.58 వరకు
దుర్ముహూర్తం ఉ.8.51 నుంచి 9.39 వరకు
తదుపరి ప.12.32 నుంచి 1.20 వరకు
అమృతఘడియలు ఉ.4.55 నుంచి 6.29 వరకు
సూర్యోదయం: 6.35
సూర్యాస్తమయం: 5.34
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: వ్యూహాలలో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో ఒత్తిడులు ఎదుర్కొంటారు.
వృషభం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు.
మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. దూరపు బంధువుల కలయిక. ఒక లేఖ ద్వారా ముఖ్య సమాచారం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
కర్కాటకం: కృషి ఫలిస్తుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
సింహం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
కన్య: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
తుల: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
వృశ్చికం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. సంఘంలో గౌరవం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.
మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
- సింహంభట్ల సుబ్బారావు