శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి బ.దశమి ఉ.8.10 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం చిత్త రా.7.18 వరకు
వర్జ్యం రా.1.13 నుంచి 2.54 వరకు
దుర్ముహూర్తం ప.11.35 నుంచి 12.26 వరకు
అమృతఘడియలు ప.12.28 నుంచి 2.10 వరకు
సూర్యోదయం: 6.27 సూర్యాస్తమయం: 5.25
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం. విద్యార్థులకు ప్రయత్నాలు సఫలం.
వృషభం: విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబ సమస్యలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: దూరప్రయాణాలు ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం: బంధువుల తాకిడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఆహ్వానాలు రాగలవు.
కన్య: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.
ధనుస్సు: శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. మీ సత్తా చాటుకుంటారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మకరం: ఆత్మీయులు, మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
కుంభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మీనం: ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు. విద్యార్థులకు ఒత్తిడులు.
సింహంభట్ల సుబ్బారావు