శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం, తిథి శు.దశమి ప.11.23 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం అశ్వని ఉ.8.19 వరకు
తదుపరి భరణి
వర్జ్యం సా.5.38 నుంచి 7.11 వరకు
దుర్ముహూర్తం ప.11.48 నుంచి 12.38 వరకు
అమృతఘడియలు రా.2.57 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృషభం: మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి
ధనలాభం. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వస్తులాభాలు.వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. బంధువులతో విభేదాలు. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు.
కన్య: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం.
తుల: నూతన పరిచయాలు. సంఘంలో గుర్తింపు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: మిత్రుల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.
మకరం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పనులలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వస్తు, వస్త్రలాభాలు.
మీనం:చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు
సూర్యోదయం: 6.34
సూర్యాస్తమయం: 5.32
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు