దుబాయ్‌లో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

YSRCP Dubai Wing Celebrates CM YS Jagan Mohan Reddy Birthday - Sakshi

దుబాయ్‌ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జా, దుబాయ్ నగరాల్లో ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ యూఏఈ కన్వీనర్లు ప్రసన్న సోమిరెడ్డి, రమేశ్‌రెడ్డి , బ్రహ్మానందరెడ్డి , కోటేశ్వరరెడ్డి, దిలీప్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు, ప్రవాసాంధ్ర సోదరులు, సోదరీమణులు కేక్ కట్ చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

వైఎస్సార్‌సీపీ యూఏఈ కన్వీనర్లు మాట్లాడుతూ... మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని అరికట్టేందుకు ‘దిశా చట్టం 2019’ ని రూపొందించి సీఎం జగన్‌ దేశ రాజకీయాల్లో రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, రైతు భరోసా, గ్రామ సచివాలయ వ్యవస్థలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నవరత్నాల్లో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని, మేనిఫెస్టోలోని ప్రతి కార్యక్రమం అమలు దిశగా సాగుతున్నారని పేర్కొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top