సాయిదత్త పీఠంలో వీనులవిందుగా కర్నాటక సంగీతం

Sai Datta Peetham conducts Carnatic music in South Plainfield - Sakshi

సౌత్ ప్లెన్‌ఫీల్డ్‌ (న్యూజెర్సీ) : అమెరికాలో భారతీయ ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠం కర్నాటక సంగీత కచేరి ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక సంగీతాన్ని పంచేందుకు ప్రముఖ కర్నాటక సంగీత ప్రావీణ్యులను సాయిదత్త పీఠానికి ఆహ్వానించింది. గాయనీ గుమ్మలూరి శారదా సుబ్రమణియన్, వయోలిన్ విద్వాంసులు శ్వేతా నరసింహాన్, మృదంగ విద్వాంసులు శబరినంద రామచంద్రన్ చేసిన సంగీత కచేరి ఆధ్యాత్మిక సంగీత ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. సిద్ధి వినాయకం, మోక్షం గలదా, శ్రీ వరలక్ష్మి సామజవరగమన, వందేశంభూం ఉమాపతి, భో.. శంభో, గోవింద బోలో, గోపాల బోలో వంటీ గీతాలు, శ్లోకాలతో పాటు సాయిభజనతో సాయి దత్త పీఠం మారుమ్రోగిపోయింది. 

కర్నాటక సంగీతంలో చక్కటి భక్తి సంగీత కచేరీని నిర్వహించిన శారదా సుబ్రమణియన్, శ్వేతానరసింహాన్, శబరినంద రామచంద్రన్‌లను సాయిదత్త పీఠం ప్రత్యేకంగా అభినందించింది. ఇదే సంగీత కార్యక్రమంలో స్వరరాగ సుధ కళా అకాడమీకి చెందిన ఉష, మణి ఆకెళ్లలకు స్వర సుధ కళా ప్రపూర్ణ పురస్కారాన్ని సాయిదత్తపీఠం ప్రదానం చేసింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top