అటల్‌జీ కి ఘన నివాళి అర్పించిన ఎన్నారైలు | NRIs Atal Bihari Vajpayee Condolence Meeting At Texas | Sakshi
Sakshi News home page

Aug 21 2018 11:03 AM | Updated on Jul 6 2019 12:42 PM

NRIs Atal Bihari Vajpayee Condolence Meeting At Texas - Sakshi

టెక్సాస్‌ : మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయికి ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు. ఆగస్టు 18న టెక్సాస్‌లోని ఎన్నారైల సంస్థలైన ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఐఎఎన్‌టీ), ఇండియన్‌ అమెరికన్‌ ఫ్రెండ్‌షిప్‌ కౌన్సిల్‌ (ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని దివంగత నేత వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమానికి ప్రారంభించారు. అనంతరం కొందరు సభ్యులు మాట్లాడుతూ.. వాజ్‌పేయి దేశానికి చేసిన సేవను కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఐఎఎన్‌టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభిజిత్‌ రాయికర్‌ ప్రారంభించగా.. బి.ఎన్‌ రావు వోట్‌ ఆఫ్ థ్యాంక్స్‌తో సభను ముగించారు.  ఐఎఎన్‌టీ అధ్యక్షుడు కమల్‌ కౌశల్‌, రాకేష్‌ బానాతి, ఐఏఎఫ్‌సీ చైర్మన్‌ ప్రసాద్‌ తోటకూర, ఐఎఎన్‌టీ ట్రస్టీ చైర్మన్‌ కుంతేష్‌ చోక్సి, బి.ఎన్‌. రావు తదితరులు పాల్గొన్నారు. 

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement