సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది: ఎన్నారై

NRI Praises CM Jagan Mohan Reddy And His Government - Sakshi

రాష్ట్రంలో రహదారుల పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో ఎవరిని అడిగినా చెప్తారు. గత ప్రభుత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరిట ఎక్కడి రోడ్లను అక్కడ తవ్వి వదిలేసిన సంగతి కూడా తెలిసిందే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల పేరుతో ప్రజల సొమ్ము దోచుకోవడం తప్ప ఒక్క చోట కూడా డ్రైనేజ్ పనులు పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో విదేశాలలో స్థిరపడ్డ గుంటూరుకు చెందిన యర్రబోతుల శ్రీనివాసరెడ్డి సెలవులు ఉండటంతో ఇండియాలోని తన స్వగ్రామమైన గుంటూరుకు వచ్చారు. ఈ క్రమంలో గుంటూరులోని తన ఇంటి పరిసరాల్లోని రోడ్ల అద్వాన పరిస్థతి చూసి నగర కమిషనర్‌ చల్లా అనురాధకు ఫిర్యాదు చేశారు. అలాగే కమిషనర్‌కు రోడ్ల ఫోటొలు తీసి వాట్సప్‌ ద్వారా సమస్యను వివరించి.. ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా కలిసి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్‌ అభ్యర్థనను వెంటనే పరిశీలించి ఎక్కువ శాతం రోడ్లు ఇలాగే ఉన్న సంగతి తమ దృష్టిలో ఉందని కమిషనర్‌ తెలిపారు. అలాగే ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి అన్ని రోడ్లను బాగు చేయించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహరెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అమె వెల్లడించారు. అంతేగాక ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్‌ ఫిర్యాదుకు వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయించారు.

 
ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారులు ప్రజల ఫిర్యాదులకు సానుకూలంగా స్పందించి... సమస్యలను పరిష్కారిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అన్నారు. అదే విధంగా గత ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఇతర టీడీపీ నాయకులు తులసీ రామచంద్ర ప్రభులు అదే వీధిలో నివసిస్తూ కూడా రోడ్లను బాగు చేయించడం తమ వల్ల కాదని చెతులెత్తేసిన సందర్బాలు ఉన్నాయి. కానీ సీఎం జగన్‌ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యే నిమోజకవర్గం అయినప్పటికీ ఎలాంటి వివక్ష చూపకుండా వెంటనే స్పందించారని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తీర్చడంలో సీఎం జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందనడానికి ఇదే ఉదహరణ అన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top