500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం

NATS helps 500 poor families in Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ప్రగతి నగర్, మదర్ థెరిస్సా, కాలనీలలో 500పేద కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలను పంపిణీ చేసింది. నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి ఆర్థిక సాయంతో నాట్స్ ఈ నిత్యావసరాలను సామాజిక దూరం పాటిస్తూ పేదలకు అందించింది. శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు చేతుల మీదుగా పేదలకు ఈ సాయం అందించారు. 

గుంటూరు నగరంలో లాక్‌డౌన్‌తో ఉపాధి లేక పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయం బాపయ్య చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి 500 పేద కుటుంబాలకు సాయం చేయడం నిజంగా అభినందనీయమని లక్ష్మణరావు అన్నారు.. భవిష్యత్తులో కూడా పేదలకు, పేద విద్యార్ధులకు సాధ్యమైనంత సాయం చేయాలని ఆయన కోరారు. సేవే గమ్యం అనే నినాదం తో నాట్స్ ఇలాంటి మరెన్నో  భవిష్యత్‌ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తుందని నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి పేర్కొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top