వేడుకగా “నాటా - మిన్నిసోటా” మహిళా దినోత్సవం

NATA Womens Day Celebrations In Minnesota  - Sakshi

మిన్నిసోటా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) వారి మిన్నిసోటా విభాగం అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం అమెరికాలోని మిన్నిసోటా రాష్త్రంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుకున్న సంఖ్యలో కంటే రెట్టింపు స్థాయిలో జనం వచ్చారని, సమస్త మహిళా లోకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సభాప్రాంగణ అలంకారములు, పసందైన విందు భోజనం, చాయాగ్రహకుల కష్టం మరెన్నో విశేషాలను మహిళా లోకం ప్రస్తావించటం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

"నాటా - మిన్నిసోటా" కార్యనిర్వాహక బృందం ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగటానికి పడ్డ కృషిని మహిళలు గుర్తించినందుకు వినమ్ర నమస్కారం తెలియజేసింది. అదే విధంగా, ఆడవారి కోసం గత కొద్ది రోజులుగా ఎంతో సహాయసహకారాలు అందించిన మగవారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. "నాటా - మిన్నిసోటా" గుర్తించి, ఈ కార్యక్రామనికి ధనసహాయం అందించిన దాతృత్వముగల దాతలందరికీ, పేరు పేరునా శిరస్సువంచి నమస్కరించారు.  

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ప్రస్తుత అధ్యక్షులుగా గోశాల రాఘవ రెడ్డి, కాబోయే అధ్యక్షులుగా కొర్సపాటి శ్రీధర్, మిన్నిసోటా విభాగం ఉపాధ్యక్షులు పిచ్చాల శ్రీనివాస రెడ్డి , ఎర్రి సాయినాథ్, ప్రాంతీయ సమన్వ్వయకర్తలుగా చింతం వెంకట్, పేరూరి రవి మరియు నారాయణ రెడ్డి, సలహాదారులుగా బండి శంకర్, చౌటి ప్రదీప్ ఉన్నారు. అదే విధంగా, ఈ కార్యక్రమ నిర్వాహణలో మూర్తి (అలంకరణ), వసుంధర రెడ్డి, దేవరపల్లి సౌజన్య, వుయ్యూరు మాలతి, చీకటి శైల, మిక్కిలినేని జయశ్రీ, బుడగం ప్రవీణ్, యడ్డాల ప్రతీప్ ఎంతగానో కష్టపడి ముఖ్య భూమికను పోషించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top