ఎమిగ్రేషన్ బిల్లుపై సూచనలు కోరిన విదేశాంగ శాఖ

Ministry of External Affairs Requests suggestions for emigration bill - Sakshi

వివిధ మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థలు, వాణిజ్య పారిశ్రామిక మండళ్లు (ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), విద్యా సంస్థలతో సంప్రదింపుల తరువాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ఎమిగ్రేషన్ బిల్ ముసాయిదాను ఖరారు చేసింది. 35 ఏళ్ల క్రితం ఏర్పాటయిన ఎమిగ్రేషన్ యాక్ట్-1983 స్థానాన్ని, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఎమిగ్రేషన్ బిల్-2019 భర్తీ చేయనున్నది.  

ప్రతిపాదిత ఎమిగ్రేషన్ బిల్-2019 ముసాయిదాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్ సైటు https://mea.gov.in/emigrationbill.htm లో చూడవచ్చు. ముఖ్యమైన అంశాలపై 4 పేజీల నివేదిక, 51 పేజీల పూర్తి ముసాయిదాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  ప్రజలు ముసాయిదా బిల్‌లో వివిధ అంశాలపై వ్యాఖ్యలు, సలహాలు 20 జనవరి 2019లోగా  విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ-మెయిళ్లు dsoia1@mea.gov.in, so2oia1@mea.gov.in కు పంపవచ్చు. కొత్త బిల్లు గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. 

-మంద భీంరెడ్డి,
గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు
+91 98494 22622

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top