టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ పండుగ

Boddamma Festival Celebrated in Frisco - Sakshi

ప్రిస్కో : బొడ్డెమ్మ.. బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందరో కోల్.. అంటూ బొడ్డెమ్మ పాటలు ఫ్రిస్కోలో మార్మోగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో బొడ్డెమ్మ పండగను ఘనంగా జరిపారు. చిన్న బతుకమ్మ పండుగకు ముందే బొడ్డెమ్మ వేడుకలు మొదలవుతాయి. పీటపై మట్టితో చేసిన బొడ్డెమ్మను పెట్టి.. పూలతో అలంకరించి.. ఎర్రమట్టి(జాజు)తో చుట్టూ అలికి.. ఆడపడుచులు బొడ్డెమ్మ పాటలు పాడారు. ఈ వేడుకల్లో 100మందికి పైగా మహిళలు, యువతులు పాల్గొన్నారు. 

బతుకమ్మ టీమ్‌ ఛైర్‌ మాధవి లోకిరెడ్డి, కో ఛైర్‌ మంజూల తోడుపునూరి, టీపీఏడీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డల్లాస్‌లోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించాలని టీపీఏడీ అధ్యక్షులు శ్రీని గంగాధర, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఛైర్‌ శారదా సింగిరెడ్డి, ఫౌండేషన్‌ కమిటీ ఛైర్‌ రఘువీరా బండారు, టీపీఏడీ నాయకులు రమణ లష్కర్‌, చంద్రా పోలీస్‌లు ప్రణాళికలు సిద్దం చేశారు. కొపెల్‌లో అక్టోబర్‌ 8న ఎంగిలిపూలు బతుకమ్మ, అక్టోబర్‌ 13న అల్లెన్‌ ఈవెంట్‌ సెంటర్‌లో సద్దులు బతుకమ్మ నిర్వహించనున్నట్టు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top