డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు | Bathukamma celebrations started in Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Oct 1 2017 1:40 PM | Updated on Oct 1 2017 6:34 PM

Bathukamma celebrations started in Dallas

డల్లాస్‌ :
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో అమెరికాలోనే అత్యంత వైభవంగా బతుకమ్మ వేడుకలను డల్లాస్‌లో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా సంప్రదాయ దుస్తుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 1500 మంది మహిళలు ఒకేచోట చేరి బతుకమ్మ ఆడారు. డా. పెప్పర్‌ ఎరేనాడల్లాస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో వివిధ సంస్కృతిక కార్యక్రమాలతోపాటూ ఆటాపాటలతో యువతి, యువకులు అతిధులను అలరించారు. అనంతరం బతుకమ్మ పాటలతో ప్రాంగణం హోరెత్తింది. బతుకమ్మ నిమజ్జనం తర్వాత కూడా అతిధుల కోసం వివిధ కార్యక్రమాలు జరిపారు.

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement
 
Advertisement
Advertisement