లండన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు | Bathukamma celebrations held in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Oct 16 2018 2:56 PM | Updated on Oct 16 2018 3:03 PM

Bathukamma celebrations held in London - Sakshi

లండన్‌ : తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా మెగా బతుకమ్మ నిర్వహించారు. యూరోప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ పండగను లండన్‌లో నిర్వహించారు. దాదాపు 2500 మంది బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొదట అమ్మవారి పూజతో ప్రారంభమైంది. యువతులు, మహిళలు బతుకమ్మ ఆట, కట్టే కోలాటం ఆడారు. సాంప్రదాయక బతుకమ్మ ఆటనే ప్రోత్సహించడానికి నూతన పోకడలకు, డీజేల జోలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో సాంప్రదాయ బద్దంగా బతుకమ్మను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన  లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత ఎన్నారైల పైన ఉందని, 6 ఏళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు.



తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ యూరోప్‌లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. యూరోప్‌లోనే మొట్ట మొదటి బతుకమ్మకు పునాదులు వేసి నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకులు గంప వేణుగోపాల్ ను అభినందించారు. 2010లో నిర్వహణ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియని సమయంలో గంప వేణుగోపాల్‌ చేసిన కృషి మరచిపోలేనిదని పేర్కొన్నారు. 2012లో బ్రిటన్ లో వివిధ ప్రాంతాల్లో ఊరూరా బతుకమ్మ నిర్వహించి బతుకమ్మ భావజాలాన్ని   చాటుతూ ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ ఆటలో పాల్గొనే స్థాయికి చేరుకుందని అన్నారు.

ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ గత ఏడాది అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి మళ్లీ ఇప్పుడు కూడా అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత  మహిళలదేనని అన్నారు. మహిళా విభాగం మీనా అంతరి, వాణి అనసూరి, శౌరి గౌడ్, సాయి లక్ష్మి, మంజుల పిట్ల, జయశ్రీ, శ్రీవాణి మార్గ్, సవిత జమ్మల, దివ్యా, అమృత, సీతాలత, నీరజ, వీణ మ్యాన, కారుణ్య, ఉష రమా లు బతుకమ్మనిర్వహణలో కీలకపాత్ర పోషించారు. వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, కోర్ సభ్యులు రంగు వెంకట్, ప్రవీణ్ రెడ్డి, నరేష్ మల్యాల, కార్యదర్శి పిట్ల భాస్కర్, అడ్వైజరి సభ్యులు డా శ్రీనివాస్, మహేష్ జమ్ముల, వెంకట్ స్వామి, బాలకృష్ణ రెడ్డి, మహేష్ చాట్ల, శేషు అల్లా, వర్మా, స్వామి ఆశా, అశోక్ మేడిశెట్టి, సాయి మార్గ్, వాసిరెడ్డి సతీష్ రాజు కొయ్యడలు బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో తమవంతు సహాయ సహకారాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement