ఉపాధ్యాయురాలికి లైంగిక వేధింపులు  | sexually harassment case booked on school teacher in nizamabad | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయురాలికి లైంగిక వేధింపులు 

Feb 10 2018 3:08 PM | Updated on Oct 17 2018 6:10 PM

sexually harassment case booked on school teacher in nizamabad - Sakshi

పాఠశాలలో విచారణ చేస్తున్న ఎంఈవో

మోర్తాడ్‌(బాల్కొండ): తనతోటి ఉపా ధ్యాయుడు తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ ఉపాధ్యాయిని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఏర్గట్ల మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం ఏర్గట్ల పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. ఉన్నత పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలితో బయోసైన్స్‌ బోధిస్తున్న ఉపాధ్యాయుడు శాంతికుమార్‌ కొన్నినెలల నుంచి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఉపాధ్యాయురా లి సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లతోపాటు, ఫొటోలను పంపించేవాడు. దీం తో ఉపాధ్యాయురాలు తన భర్తకు, కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశారు. కాగా శాంతికుమార్‌ గతంలో ధర్మారం బీ పాఠశాలలో ఇలాగే వ్య వహరించడంతో అతనికి అక్కడ దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. కేసు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై హరిప్రసాద్‌ తెలిపారు. అలాగే ఎంఈవో బి. రాజేశ్వర్‌ పాఠశాలలో విచారణ జరిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement