సోదరిపైనే దారుణానికి ఒడిగట్టాడు! | Youth held for raping minor sister in Maharastra | Sakshi
Sakshi News home page

సోదరిపైనే దారుణానికి ఒడిగట్టాడు!

Sep 22 2015 7:17 PM | Updated on Oct 4 2018 8:31 PM

సోదరిపైనే దారుణానికి ఒడిగట్టాడు! - Sakshi

సోదరిపైనే దారుణానికి ఒడిగట్టాడు!

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే రీతిలో మరో దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

థానే :  సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే  రీతిలో మరో దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కామంతో ఓ యువకుడు వావివరుసలు మరిచిపోయి ప్రవర్తించాడు. రక్తం పంచుకు పుట్టిన సోదరిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ ఘాతుకానికి పాల్పడ్డ అతడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లా డాంబివిలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన సోదరిపై రెండుసార్లు అత్యాచారం చేశాడు.  అయితే ఈ క్రమంలో సోదరుడి బారి నుంచి తప్పించుకునేందుకు యత్నించగా బాధితురాలిపై కత్తితో దాడి చేసి దుశ్చర్యకు పాల్పడ్డాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా  బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ శివార్కర్ వెల్లడించారు. నిందితుడిపై 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement