‘బులంద్‌షహర్‌ ఘటన ఓ ప్రమాదం మాత్రమే’

Yogi Adityanath Said Bulandshahr Violence Was An Accident - Sakshi

లక్నో : బులందషహర్‌లో జరిగింది మూక దాడి కాదు.. అది ఒక ప్రమాదం అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల కిత్రం బులంద్‌షహర్‌లో జరిగిన మూక దాడి ఘటనలో ఓ పోలీస్‌ అధికారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. యోగి ఈ దాడిని ఒక ప్రమాదంగా ప్రకటించడమే కాక.. సరైన సమయంలో స్పందిచంలేదంటూ ఇద్దరు పోలీసు అధికారులను ట్రాన్సఫ్‌ర్‌ చేశారు.

అడిషనల్‌ డీజీపీ ఎస్‌బీ షిరాద్కర్‌ ఇచ్చిన రిపోర్టు ప్రకారం యోగి ప్రభుత్వం సర్కిల్‌ ఆఫీసర్‌ సత్య ప్రకాష్‌ శర్మ, ఇన్‌ చార్జ్‌ ఆఫ్‌ ద పోలీస్‌ పోస్ట్‌ సురేష్‌ కుమార్‌లను ట్రాన్సఫర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోరక్షక ముఠా రెచ్చిపోయింది. ఓ మతానికి చెందిన ప్రజలు ఆవును చంపేశారని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగింది. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా స్థానిక పోలీస్‌ ఔట్‌పోస్ట్‌తో  పాటు పలు వాహనాలకు నిప్పంటించింది. ఈ ఘటనలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

అయితే గతంలో ఈ దాడిని భారీ కుట్రగా పేర్కొన్న యోగి.. మాట మార్చి ఇది కేవలం యాక్సిడెంట్‌ అని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ దాడికి కారకులుగా భావిస్తూ పోలీసు అధికారులు 9 మందిని అరెస్ట్‌ చేశారు. కానీ ముఖ్యమైన కుట్రదారు యోగేష్‌ రాజా పరారీలో ఉండగా తాజాగా ఓ జవాను పేరు తెరమీదకు వచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top