‘చెన్నైకు తెలుగుగంగను ఆపితే సహించం’ | won't tolerate, if stop telugu ganga water to Tamilnadu | Sakshi
Sakshi News home page

‘చెన్నైకు తెలుగుగంగను ఆపితే సహించం’

Oct 5 2013 1:34 AM | Updated on Jun 18 2018 8:10 PM

ఆంధ్రప్రదేశ్ విభజనకు తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి పి.చిదంబరాన్ని కారణంగా చూపుతూ చెన్నైకి తెలుగుగంగ జలాలను నిలిపివేస్తే సహించేది లేదని తెలుగు సంఘాలు హెచ్చరించాయి.

చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ విభజనకు తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి పి.చిదంబరాన్ని కారణంగా చూపుతూ చెన్నైకి తెలుగుగంగ జలాలను నిలిపివేస్తే సహించేది లేదని తెలుగు సంఘాలు హెచ్చరించాయి. 7న చెన్నైకి తెలుగుగంగ కాలువలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటామని సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ శ్రీకాళహస్తిలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆస్కా అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి, తెలుగు సంఘాల అధ్యక్షులు డా. సీఎంకే రెడ్డి, కె.నరసారెడ్డి, టి.రామకృష్ణ, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంవీ నారాయణగుప్తా, రంగనాయకులు శుక్రవారమిక్కడ మీడియూతో మాట్లాడారు. తెలుగుగంగను అడ్డుకుంటే తెలుగువారికి, తమిళులకు మధ్య అగాధాన్ని సృష్టిస్తుందని ఆందోళన వెలిబుచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement