బస్సులో మృగాల కంటే దారుణంగా.. | Sakshi
Sakshi News home page

బస్సులో మృగాల కంటే దారుణంగా..

Published Wed, Mar 9 2016 11:39 AM

బస్సులో మృగాల కంటే దారుణంగా..

బరేలి: ఉత్తరప్రదేశ్లో ఇద్దరు దుండగులు మృగాల కంటే దారుణంగా ప్రవర్తించారు. బస్సు డ్రైవర్, కండెక్టర్ ఓ బాలింతపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు దుండగుల బారి నుంచి రక్షించుకునే ప్రయత్నంలో ఆమె ఒడి నుంచి 14 రోజుల పసికందు జారిపడి మరణించాడు.

రాయ్పూర్కు చెందిన 28 ఏళ్ల యువతి తన ఇద్దరు పిల్లలతో కలసి బరేలిలోని సోదరి ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి రాయ్పూర్కు తిరిగి వెళ్లేందుకు ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణిస్తూ ఆమె నిద్రపోయింది. బస్ స్టాప్లో మిగతా ప్రయాణికులందరూ దిగిపోగా నిద్రమత్తులో ఉన్న ఆమె గమనించలేదు. బస్సులో ఒంటరిగా  మిగిలిపోయిన బాలింతపై డ్రైవర్, కండెక్టర్ లైంగికదాడికి పాల్పడ్డారు. వారిని ఎదిరించే క్రమంలో బాధితురాలు తన రోజుల బిడ్డను కోల్పోయింది. బస్సు డ్రైవర్, కండెక్టర్ ఆమెను రోడ్డుపై దించివేసి వెళ్లిపోయారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు చేసుకోగా.. ఆమెకు మరచిపోలేని పీడకలను మిగిల్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement