మరో వివాహం చేసుకున్నా పింఛన్‌

Widows Entitled To Family Pension After Remarriage - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి చనిపోయాక అతని భార్య మరో వివాహం చేసుకున్న తర్వాత కూడా పింఛన్‌ పొందేందుకు ఆమె అర్హురాలేనని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన రేణు గుప్తా అనే మహిళ పింఛన్‌కు సంబంధించిన కేసులో ఆదేశాలిస్తూ క్యాట్‌ ఈ విషయాన్ని ప్రస్తావించింది. రక్షణ శాఖలో పనిచేసే పవన్‌ కుమార్‌ గుప్తా 1990వ దశకం చివర్లో చనిపోయారు. ఆమె భార్య రేణు గుప్తాకు 1998లో ప్రభుత్వం కారుణ్య నియామకం కింద స్టోర్‌ కీపర్‌గా ఉద్యోగమిచ్చి పింఛన్‌ కూడా మంజూరు చేసింది.

అయితే రేణు మరో వివాహం చేసుకున్న అనంతరం 2002లో పింఛన్‌ను తన కొడుకు కరణ్‌ గుప్తా పేరు మీదకు మార్చింది. సాధారణంగా కుమారుడికి 25 ఏళ్లు రాగానే పింఛన్‌ ఆగిపోతుంది. దీంతో 2013లో పింఛన్‌ ఆగిపోవడంతో మళ్లీ తనకే పింఛన్‌ ఇవ్వాలని రేణు కోరింది. భర్త చనిపోయిన 20 ఏళ్ల తర్వాత ఆమె పింఛన్‌ మార్పు కోరుతోందనీ, అందునా ఆమె ఇప్పుడు మరో పెళ్లి చేసుకుందనే కారణాలు చూపుతూ అధికారులు ఆమెకు పింఛన్‌ను ఇవ్వలేదు. దీంతో రేణు క్యాట్‌ను ఆశ్రయించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top