నా అకౌంట్ లోకి 15 లక్షలు ఎప్పుడొస్తాయి? | When will Rs 15 Lakh be deposited in every Indian’s account, PMO told to respond | Sakshi
Sakshi News home page

నా అకౌంట్ లోకి 15 లక్షలు ఎప్పుడొస్తాయి?

Sep 1 2016 1:55 PM | Updated on Sep 4 2017 11:52 AM

నా అకౌంట్ లోకి 15 లక్షలు ఎప్పుడొస్తాయి?

నా అకౌంట్ లోకి 15 లక్షలు ఎప్పుడొస్తాయి?

నా ఖాతాలోకి రూ.15 లక్షలు ఎప్పుడొస్తాయి? అని రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద పీఎంవో దరఖాస్తు చేశాడు.

న్యూఢిల్లీ: నా ఖాతాలోకి రూ.15 లక్షలు ఎప్పుడొస్తాయి? అని రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయా(పీఎంవో)నికి దరఖాస్తు చేశాడు. అతనికి 15 రోజుల్లోపు సమాచారమివ్వాల్సిందిగా పీఎంవోను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి, దేశంలోని ప్రతి పేదవాడికి రూ.15 లక్షలిస్తా’ అని మోదీ హామినిచ్చారనీ, ఆ హామీ అమలు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని ఝాలావాడ్ జిల్లాకు చెందిన కన్హయ్య లాల్ పీఎంవో సహ చట్టం కింద దరఖాస్తు చేశారు. దేశం నుంచి అవినీతిని తరిమికొట్టడానికి కొత్త చట్టం ఎప్పుడు తెస్తారో కూడా చెప్పాలని కన్హయ తన దరఖాస్తులో పేర్కొన్నాడు.

రైలు ప్రయాణాల్లో వృద్ధులకు 40 శాతం రాయితీని ఇస్తూ యూపీఏ తీసుకొచ్చిన పథకాన్ని తొలగించే ఆలోచన ఏదైనా ఉందా అని కూడా కన్హయ్య అడిగారు. సమాధానం లేకపోవడంతో ఆయన అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించారు. విచారణకు వచ్చిన పీఎంవో అధికారి తమ వాదన వినిపిస్తూ, అర్జీ తమ వద్దకు రాలేదనీ, అందుకే సమాచారమివ్వలేక పోయామని చెప్పారు. 15 రోజుల్లో కన్హయ్యకు సమాచారం ఇవ్వాలని ప్రధాన సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాథూర్ పీఎంవోను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement