కేంద్రానికి సహకరించని పశ్చిమబెంగాల్‌

West Bengal Not Cooperating With Central Team - Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోందని కోవిడ్‌–19 ప్రభావాన్ని అంచనా వేసేందుకు వచ్చిన రెండు కేంద్ర బృందాలు విమర్శించాయి.  లాక్‌డౌన్‌ని కఠినంగా అమలుచేయాలని స్పష్టం చేశాయి. అలాగే తమ సభ్యుల రక్షణకు అధికార పార్టీ బాధ్యత వహిస్తుందా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కోల్‌కతా,  సిలిగురిలో పర్యటిస్తోన్న బృందానికి అవసరమైన సమాచారం అందించడంలోనూ, ప్రభుత్వం నుంచి ఎదురైన సహాయనిరాకరణపై రెండు కేంద్ర బృందాలు ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌ సిన్హాకి లేఖలు రాశాయి. ఇప్పటి వరకు నాలుగు లేఖలు రాశామనీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తోన్న సీనియర్‌ అధికారి అపూర్వ చంద్ర చెప్పారు. కేంద్ర బృందం రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే స్వేచ్ఛ ఉందనీ, అయితే వారితో కలవడం వల్ల తమ సమయం వృథా అవుతుందనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top