పెళ్లి వేదికపై వధువు కాల్చివేత | Wedding stage Bride shot dead in | Sakshi
Sakshi News home page

పెళ్లి వేదికపై వధువు కాల్చివేత

May 10 2014 5:38 AM | Updated on Sep 2 2017 7:08 AM

పెళ్లి వేదికపై  వధువు కాల్చివేత

పెళ్లి వేదికపై వధువు కాల్చివేత

మధ్యప్రదేశ్‌లో ఓ భగ్న ప్రేమికుడు ఉన్మాదిలా మారాడు. తాను ప్రేమించిన మరదలు మరొకరిని పెళ్లిచేసుకోవడాన్ని తట్టుకోలేక ఆమెను హతమార్చాడు.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ భగ్న ప్రేమికుడు ఉన్మాదిలా మారాడు. తాను ప్రేమించిన మరదలు మరొకరిని పెళ్లిచేసుకోవడాన్ని తట్టుకోలేక ఆమెను హతమార్చాడు. పెళ్లి వేదికపై అందరూ చూస్తుండగానే డాక్టర్ జయశ్రీ నామ్‌దేవ్ (29) అనే నవవధువును తుపాకీతో కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లి తంతుకు ముందు వేదికపై వరుడితో కలిసి జయశ్రీ అతిథుల ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు అందుకుంటుండగా రాత్రి 11:15 గంటలకు అక్కడకు వచ్చిన ఆమె మేనత్త కొడుకు అనురాగ్... అతి సమీపం నుంచి జయశ్రీని కాల్చాడు.

గొంతులోకి తూటా దూసుకుపోవడంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించ గా చికిత్స పొందుతూ మృతిచెందింది. జయశ్రీని కాల్చిన అనంతరం అనురాగ్ తనను తాను కాల్చుకునేందుకుయత్నించగా ఆ తూటా మరొకరిని తాకుతూ పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన అనంతరం మృతురాలి బంధువులు అనురాగ్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. జయశ్రీ తనను మోసం చేసిందని..అందుకే కాల్చి చంపానని నిందితుడు పోలీసులకు చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement