ఆ ఆచారాన్ని మేం కాపాడాలి | We have to be protected that tradition | Sakshi
Sakshi News home page

ఆ ఆచారాన్ని మేం కాపాడాలి

Feb 7 2016 1:36 AM | Updated on Sep 2 2018 5:24 PM

శబరిమల గుడిలోకి ఋతుస్రావ వయసులోని మహిళల ప్రవేశంపై నిషేధం మత విషయమని..

‘శబరిమల’లో మహిళల నిషేధంపై కేరళ సర్కారు

 న్యూఢిల్లీ:  శబరిమల గుడిలోకి ఋతుస్రావ వయసులోని మహిళల ప్రవేశంపై నిషేధం మత విషయమని.. భక్తులకున్న మతాచారహక్కును కాపాడాల్సిన బాధ్యత తమకు ఉందని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ గుడి పాలనాధికారం.. ట్రావెన్‌కోర్-కొచ్చిన్ హిందూ మత సంస్థల చట్టం కింద ట్రావెన్‌కోర్ దేవాస్వమ్ బోర్డుకు ఉంది కాబట్టి, మత విషయాల్లో పూజారుల అభిప్రాయమే అంతిమమంది. 

గుడిలోకి మహిళల ప్రవేశానికి మద్దతునిస్తూ గత ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటూ.. ప్రస్తుత యూడీఎఫ్ ప్రభుత్వం తాజా అఫిడవిట్‌ను సమర్పించింది.10-50 ఏళ్ల వయసున్న మహిళల  ప్రవేశంపై అనాది కాలం నుంచి నియంత్రణలు ఉన్నాయని.. ఇది రాజ్యాంగంలోని 25, 26 అధికారణల కింద భక్తులు తమ మత విశ్వాసాలు, ఆచారాలను ఆచరించే హక్కు కిందకు వస్తుందని పేర్కొంది. కాబట్టి.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను కొట్టేయాలంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement