చెన్నైలో వర్షం : టెకీలకు బిగ్‌ రిలీఫ్‌

Water Crisis Hit Chennai Sees First Rain - Sakshi

చెన్నై : తీవ్ర నీటి కొరతతో ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్న చెన్నై నగరానికి చల్లటి కబురు అందింది. భానుడి భగభగలతో అల్లాడిన చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గురువారం వరుణుడి రాక జనానికి ఊరట కల్పించింది. వర్షాలతో చెన్నైలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా 27 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ఉక్కపోతల నుంచి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. వర్షం దృశ్యాలను పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

కాగా, జూన్‌ 13న తమిళనాడుకు రుతుపవనాలు రావాల్సి ఉన్నా వాయు తుపాన్‌ దిశ మారడంతో రుతుపవనాల్లో జాప్యం ఏర్పడింది. జూన్‌ 21 నుంచి 23 మధ్య తమిళనాడులో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ వర్షాలతో భూగర్భ జలాల మట్టం​ పెరిగే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్ధితులతో పాటు అధిక ఉష్ణోగ్రతలతో చెన్నై సహా తమిళనాడులో తీవ్ర నీటి కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. నీటి లభ్యత అడుగంటడంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top