వికాసం పేరుతో..వినాశం

Water Airport In Chilika Lake - Sakshi

బరంపురం ఒరిస్సా : ప్రకృతి అందాలతో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన చిలికా సరస్సు వికాసం పేరుతో వినాశానికి  ఒడిగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వెంటనే అపాలని ప్రకృతి బంధు  ప్రఫుల్ల సామంతరాయ్‌ కోరారు. మంగళవారం హల్‌పట్నా మెయిన్‌ రోడ్‌లో గల ప్రఫుల్ల సామంత్‌ రాయ్‌ నివాసంలో లోక్‌ శక్తి అభియాన్‌ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా లోక్‌శక్తి అభియాన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రఫుల్ల సామంత్‌ రాయ్‌ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం చిలికా సరస్సులో జల విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర పౌర విమాయానన శాఖ లాంచనంగా నిర్ణయించినట్లు ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే చిలికా సరస్సులో  ఇటువంటి జల విమానాశ్రయం నిర్మాణం చేపడితే సహజ ప్రకృతి సౌందర్యం కోల్పోవడమే కాకుండా చిలికా సరస్సులో కలుషిత వాతవరణం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ప్రతి ఏడాదీ లక్షలాది విదేశీ విహంగాలు చిలికా సరస్సులో ఉన్న దీవుల్లో పాటుపడే సంతాన అభివృద్ధికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి వెంటనే చిలికా సరస్సులో జల విమానాశ్రయం నిర్మాణం ఆపివేయాలని కోరారు. లేనిపక్షంలో లోక్‌శక్తి అభియాన్‌ ఆధ్వర్యంలో ప్రజాందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ శెట్టి, లక్ష్మీనరసింహ శెట్టి, సుధామ్‌ శెట్టి, శ్రీకాంత్‌ శెట్టిలు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top