వైరల్‌: సింగర్‌ అవతారమెత్తిన కుక్క

Viral Video: Dog Sings Teri Meri Kahaani Song Along With Man - Sakshi

కొన్ని పాటలు వినగానే దాన్ని పాడిన వ్యక్తులు టక్కున గుర్తొస్తారు. అలా కొన్ని పాటలు భీభత్సంగా క్రేజ్‌ను సంపాదించుకుంటాయి. ఇక సోషల్‌ మీడియా సెన్సేషన్‌ రణు మొండాల్‌.. తేరీ మేరీ సాంగ్‌తో ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ పాటతో ఒక్కసారిగా ఆమె జీవితమే మారిపోయింది. రైల్వేస్టేషన్‌ నుంచి ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ స్థాయికి ఎదిగిపోయింది. తాజాగా ఆ పాటను ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తూ ఆలపించాడు. ఇక్కడ విశేషమేంటంటే అతనితోపాటు ఓ కుక్క కూడా అతనితో గొంతు కలిపింది. మొరుగుతూ, అరుస్తూ కుక్క భౌమంటూ పాట అందుకుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. కుక్క పాటకు నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఈ వీడియోలో అంతు చిక్కని విషయమేంటంటే.. అది పాడటానికి ప్రయత్నిస్తుందో.. లేక పాట భరించలేక ఆపేయమని అర్థిస్తుందో తెలిసి చావట్లేదని ఓ నెటిజన్‌ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ‘అతని పాటను శునకం భరించలేకపోతుంది. అందుకే అతను పాడకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది’, ‘పర్లేదు.. నాకన్నా ఆ కుక్కే బాగా పాడుతోంది’, ‘భలే.. ఇద్దరూ ఒకేలా పాడుతున్నారు’, ‘కుక్క పాట పాడితే ఇలా ఉంటుంది’ అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

వైరల్‌ : దాదాతో డ్యాన్స్‌ చేయించిన హర్భజన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top