‘అక్కడికి వచ్చి నన్ను పిలవండి.. వస్తాను’

Viral: Man Given Address On Package Is Winning Hearts On The Internet - Sakshi

జైపూర్‌ : ఆన్‌లైన్‌ డెలివరీ అందుబాటులోకి వచ్చాక ఉప్పు, పప్పు నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ అన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేస్తున్నాం. ఈ విధానం ద్వారా మనకు కొంత సమయం ఆదా అవుతుందనే చెప్పాలి. అయితే ఏ వస్తువు ఆర్ఢర్‌ చేసినా అది మన వద్దకు చేరాలంటే ముందుగా డెలివరీ అడ్రస్‌ ఇవ్వడం సర్వ సాధారణం. అప్పుడే అది మన ముంగిట్లోకి వచ్చి వాలుతుంది. అప్పుడప్పుడు మనం చేసిన ఆర్డర్లకు బదులు కొన్నిసార్లు వేరే వస్తువులు డెలివరీ అవుతుంటాయి. ఇలాంటి సందర్భాలు మచ్చుకు కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రముఖ అన్‌డౌన్‌ డెలివరీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువును ఆర్డర్‌ చేశారు. అయితే షిప్పింగ్‌ అడ్రస్‌ను మాత్రం వినూత్నంగా రాశాడు. (ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లంటే ఇదేనేమో..)

రాజస్థాన్‌లోని కోటాలో డెలివరీ చేయాల్సిన ఈ ప్యాకిజీలో ‘444 చాత్‌ దేవాలయం. అక్కడికి వచ్చి నన్ను పిలవండి. నేను వస్తాను’. అని రాశాడు. దీనిని ట్విటర్‌ యూజర్‌ మంగేష్‌ అనే వ్యక్తి ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక ఈ ట్వీట్‌లో ఉన్న చిరునామా చూసిన నెటిజన్లు తమ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వైరల్‌ అవ్వడంతో అనేకమంది నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ‘ఇండియా అంటే వేరే లెవల్‌, ఇది ఎంతో సరాదాగా ఉంది’ అని కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ సంస్థ కూడా స్పందించడం విశేషం. ప్యాకేజీపై ఉన్న అడ్రస్‌ను చూపిస్తూ. ‘ప్రతి ఇల్లు ఓ ఆలయమే.. ఇది సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది’ అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో పోస్టు చేసింది. (వైరల్‌: అల్లుడి కోసం 67 రకాల వంటకాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top