
దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయిన విజయశాంతి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌తో మెదక్ ఎంపీ విజయశాంతి సోమవారం సమావేశమైయ్యారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌తో మెదక్ ఎంపీ విజయశాంతి సోమవారం సమావేశమైయ్యారు. ఆమెను టీఆర్‌ఎస్ నుంచి సస్పండ్ చేసిన తరువాతం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమె కాంగ్రెస్ లో చేరడం ఖాయమయింది. విజయశాంతితో పాటు రఘునందన్ కూడా దిగ్విజయ్ ను కలిశారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవల విజయశాంతి కలిశారు. రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్‌లో చేరికపై సోనియాగాంధీతో విజయశాంతి తన మనోగతాన్ని వెల్లడించినట్లు తెలిసింది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అంశాన్ని సోనియా ఎదుట ప్రస్తావించినట్లు సమాచారం.
కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న విజయశాంతిపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జూలై 31 అర్ధరాత్రి వేటు వేసిన విషయం తెలిసిందే. విజయశాంతి పార్టీని వీడినా పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సుమారు నాలుగేళ్లుగా మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా కేడర్‌తో సత్సంబంధాలు నెరపడంలో విజయశాంతి విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. విజయశాంతి చేరిక వల్ల వచ్చే లాభనష్టాలపై పార్టీ అధిష్టానం అంచనాకు వచ్చిన తర్వాతే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉంటారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.