'ఉత్తమ విలన్ పై నిషేధం విధించండి' | VHP calls for ban on Kamal Haasan's 'Uttama Villain' | Sakshi
Sakshi News home page

'ఉత్తమ విలన్ పై నిషేధం విధించండి'

Apr 7 2015 12:17 PM | Updated on Sep 19 2019 9:06 PM

'ఉత్తమ విలన్ పై నిషేధం విధించండి' - Sakshi

'ఉత్తమ విలన్ పై నిషేధం విధించండి'

విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఉత్తమ విలన్ చిత్రం విడుదలకు ముందే అనేక అవాంతరాలను ఎదుర్కొంటుంది.

చెన్నై:విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఉత్తమ విలన్ చిత్రం విడుదలకు ముందే అనేక అవాంతరాలను ఎదుర్కొంటుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో వాయిదా పడిన ఉత్తమ విలన్  చిత్రంపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పిలుపునిచ్చింది. ఆ చిత్రంలోని సన్నివేశాలు హిందూవుల మనోభావాలను కించే పరిచే అవకాశం ఉన్న కారణంగా నిలుపుదల చేయాలంటూ పోలీస్ కమిషనర్ కు వీహెచ్ పీ ఓ నివేదికను సమర్పించింది.

 

ప్రధానంగా విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదనకు, హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి జరిగే సంభాషణ ఆధారంగా తెరకెక్కిన ఒక పాట విష్ణుమూర్తి భక్తులను నిరాశకు గురి చేస్తుందని వివరించింది. దీంతో ఆ సినిమా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement