‘తండ్రి గోత్రం చెప్పి ఉంటే బాగుండేది’ | Vasundhara Raje Comments On Rahul gandhi In Election Campaign | Sakshi
Sakshi News home page

‘తండ్రి గోత్రం చెప్పి ఉంటే బాగుండేది’

Nov 28 2018 8:46 AM | Updated on Nov 28 2018 8:49 AM

Vasundhara Raje Comments On Rahul gandhi In Election Campaign - Sakshi

తండ్రి రాజీవ్‌ గాంధీ, తాత ఫిరోజ్‌ గాంధీల గోత్రాన్ని చెప్పి ఉండాల్సింది.

జైపూర్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పుష్కర్‌లోని బ్రహ్మ దేవాలయాన్ని సందర్శించినప్పుడు రాహుల్‌ గాంధీ తన గోత్రానికి బదులు తన నానమ్మ తండ్రి అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ గోత్రం చెప్పారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ర్యాలీలో రాజే మాట్లాడుతూ ‘రాహుల్‌ తన గోత్రం ఏంటో చెప్పలేదు.  ఆయన పేర్కొన్నది నెహ్రూ గోత్రం. పూజ సందర్భంగా రాహుల్‌ తన తండ్రి రాజీవ్‌ గాంధీ, తాత ఫిరోజ్‌ గాంధీల గోత్రాన్ని చెప్పి ఉండాల్సింది. కానీ ఆయన ఎందుకనో అలా చేయలేదు’  అని రాజే వ్యాఖ్యానించారు.

కాగా పుష్కర్‌ ఆలయంలో రాహుల్‌ తన గోత్రం ‘దత్తాత్రేయ’ అని, తాను కశ్మీరీ బ్రాహ్మణుడిని అని తెలిపినట్లు ఆ పూజ నిర్వహించిన పూజారి వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement