‘సరి-బేసి’పై సరిగమలు | Vadra vs AAP | Sakshi
Sakshi News home page

‘సరి-బేసి’పై సరిగమలు

Dec 27 2015 2:42 AM | Updated on Oct 22 2018 9:16 PM

‘సరి-బేసి’పై సరిగమలు - Sakshi

‘సరి-బేసి’పై సరిగమలు

కాలుష్య నియంత్రణకు సరి-బేసి ఫార్ములా తెచ్చిన ఢిల్లీ సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు.

♦ వాద్రా వర్సెస్ ఆప్
♦ వీఐపీ వాహనాలకు మినహాయింపుపై వాద్రా విమర్శలు
 
 న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణకు సరి-బేసి ఫార్ములా తెచ్చిన ఢిల్లీ సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. ఇందులోనూ వీఐపీల వాహనాలను మినహాయించడం ఏమిటని ప్రశ్నించారు. ‘ఏదైనా ఓ చట్టం తెస్తే సామాన్యులు, వీఐపీలు అన్న తేడా లేకుండా అందరూ దానికి కట్టుబడి ఉండాలి. కానీ సరి-బేసికి సంబంధించి రెండు జాబితాలు సిద్ధమవుతున్నాయి. ఇది కపటం కాదా?..’ అని ఫేస్‌బుక్‌లో ప్రశ్నించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహనాల నంబర్ల ప్రకారం.. సరి, బేసి వాహనాలను రోజు మార్చి రోజు నడిపేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. దీన్ని జనవరి 1 నుంచి అమలు చేయనుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.2 వేల జరిమానా వేయాలని సర్కారు భావిస్తోంది.

వీఐపీ వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు కల్పించారు. కాగా, ‘వీలైతే ఏమైనా సాయం చేయండి, అంతేకానీ రాళ్లేయాలని చూడకండి. ఆయనే ఓ పెద్ద కపటి. ఆయనే కపటత్వం గురించి మాట్లాడుతున్నారు’ అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వాద్రాపై మండిపడింది. ‘ఇప్పటిదాకా ఆయన ఈ సమాజానికి ఏం చేశారో చెప్పాలి. కొత్త విధానంపై విమర్శలు చేసే బదులు అది విజయవంతం అయ్యేందుకు ఏమైనా సూచనలు చేయొచ్చు కదా..?’ అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement