జొమాటోను నిలదీస్తున్న నెటిజన్లు..!

Users Criticism On Zomato App Pointing Halal Tag - Sakshi

న్యూఢిల్లీ: ‘ఆహారానికి మతం లేదు. ఆహారమే ఓ మతం’ అన్న జొమాటో ట్వీట్‌పై ఓవైపు ప్రసంశల వర్షం కురుస్తుండగా.. మరోవైపు విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. మతమే లేదన్నప్పుడు యాప్‌లో హలాల్‌ ట్యాగ్‌ ఎందుకు కొనసాగిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘హలాల్‌ మాంసం మాత్రమే తినేవారికి..  ప్రత్యేకంగా ఫుడ్‌ని అందిస్తున్నారు కదా’ అని నిలదీస్తున్నారు. జొమాటో యాప్‌ బాగోలేదంటూ గూగుల్‌ ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌లలో 1-స్టార్‌ రేటింగ్‌ ఇస్తున్నారు. తమదైన శైలిలో యాప్‌ను ఏకిపారేస్తున్నారు. ఇక  జొమాటోకు మద్దతు తెలిపిన ఊబర్‌ ఈట్స్‌ను కూడా నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. #boycottUberEats అని ట్రోల్‌ చేస్తున్నారు.
(చదవండి : ఆహారానికి మతం లేదు)

కాగా, నెటిజన్ల కామెంట్లపై జోమాటో వివరణ ఇచ్చింది. ‘తమ వద్ద ఎన్ని రకాల ఆహార పదార్థాలు లభ్యమవుతాయో కస్టమర్లకు తెలిసేందుకే హలాల్‌ ట్యాగ్‌ని అందుబాటులో ఉంచాం. మతపరమైన వ్యత్యాసాల్ని చూపెట్టేందుకు కాదు. హలాల్‌ ట్యాగ్‌లో ప్రత్యేక వంటకాలను అందించే రెస్టారెంట్లు ఉంటాయి. కొందరు హలాల్‌ మాంసం తీసుకోరు. మరికొందరు తీసుకుంటారు. కస్టమర్ల సేవల కోసమే ఆ ట్యాగ్‌’ అని వెల్లడించింది. ఇక బుధవారం వెలుగు చూసిన హిందూయేతర వ్యక్తి ఫుడ్‌ డెలివరీ చేసిన వ్యవహారం నేపథ్యంలో.. ‘హిందూ ఓన్లి రైడర్‌’ అని జొమాటో ట్వీట్‌ చేయడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. జోమాటోకు 1 స్టార్‌ ఇస్తున్నామని కొందరు.. యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తున్నామని మరికొందరు టీట్లు, కామెంట్లు చేస్తున్నారు. ఇతర యాప్‌లకు జైకొడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top