ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం వ్యతి రేక ఉద్యమకారుడు ఉదయకుమార్ వైదొలిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కన్యాకుమారిలో
టీనగర్: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం వ్యతి రేక ఉద్యమకారుడు ఉదయకుమార్ వైదొలిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కన్యాకుమారిలో ఉదయకుమార్ పోటీ చేశారు. అయితే ఊహించిన స్పందన రాకపోవడంతో మళ్లీ ఉద్యమకారుడిగానే ప్రస్తానం కొనసాగించారు. ఈయనతోపాటు ఉద్యమంలో పాల్గొని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి నెల్లై నుంచి పోటీ చేసి ఎంపి జేసురాజ్, తూత్తుకుడి నుంచి పోటీ చేసిన పుష్పరాయన్‌లు చీపుర కట్ట చిహ్నంపై పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వారు వైదొలుగుతున్నట్లు ఉదయకుమార్ ప్రకటించారు.
దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారులతోను, జాలర్ల గ్రామాల ప్రజలతోను సామాజిక నేతలతోను కలిసి చర్చించిన మీదట ఆమ్ ఆద్మీ పార్టీలో కొన్ని నిబంధనల మేరకు చేరామని అయితే రాష్ట్ర ప్రజల అనుభవాలు, రాష్ట్ర రాజకీయాల పరిస్థితి, అణు కర్మాగారానికి వ్యతిరేకంగా పార్టీ అదిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీని గురించి పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌తో అనేకసార్లు చర్చించామని, లేఖలు రాశామన్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తాను ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు.