కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గత కొద్ది రోజులుగా అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న బడ్జెట్ శనివారం విడుదల అయ్యింది. దీనిపై సామాన్యుల నుంచి ఆర్థికరంగ నిపుణుల వరకు ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. దేశ రాజధానిలో ఇటీవలి జరిగిన ఎన్నికల్లో సామాన్యుడి చేతిలో భంగపడ్డ మోడీ సర్కారు.. ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా సామాన్యులని ఎలా ప్రసన్నం చేసుకుంటుంది.. అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. బడ్జెట్ అంచనాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి.
* బడ్జెట్లో పన్ను ప్రోత్సహకాలకు అవకాశం
* పన్నుల రాబడులకు 'ట్యాక్స్' బేస్ ను పెంచే అవకాశం
* ఆరోగ్య బీమా పథకాల్లో పన్ను రాయితీలు ఉంటాయని అంచనా
*మోదీ 'మేక్ ఇన్ ఇండియా'నే లక్ష్యంగా బడ్జెట్!
*పన్ను మినహాయింపు వర్తించే వార్షికాదాయం పరిమితి పెంచే ఛాన్స్
* భారీ పెట్టుబడులు భారత్కు వచ్చేలా బడ్జెట్ రూపకల్పన!
* బంగారంపై 1% వ్యాట్ పెంచే అవకాశం
* ముడి చమురుపై కస్టమ్స్ సుంకాన్ని తిరిగి విధించే సూచన
* డిజిన్వెస్టిమెంట్ టార్గెట్ రూ.75 వేల కోట్ల లక్ష్యం
* ఉక్కు దిగుమతులపై భారీ రాయితీలు ఇచ్చే అవకాశం
* రియల్ ఎస్టేట్కు భారీ రాయితీలు ఇచ్చే అవకాశం
* ఫార్మా కంపెనీలకు భారీ ప్రోత్సహకాలు!
* పెట్రో రంగంలో పెట్టుబడులకు పెద్దపీట!
* వాహన ధరలు తగ్గే అవకాశం
* వాహన తయారీ రంగంలో ఎక్సైజ్ పన్ను తగ్గే అవకాశం